శ్రీ రామకోటిలేఖన వైశిష్ట్యము

శ్రీ మన్నారాయణుని మంత్రమైన అష్టాక్షరి నుంచి 'రా', శంకరుని మంత్రమైన పంచాక్షరి నుంచి 'మ', అనే అక్షరముల సంపుటి రామ మంత్రమని భారతీయుల విశ్వాసము. ఈ రామ శబ్దమునకు 'శ్రీ' చేర్చి 'శ్రీ రామ' మంత్రము తారక మంత్రముగా ఆరాధించి తరించిన మహనీయుల పుట్టిన దేశము ఆంధ్రదేశము. అనాది కాలముగా శ్రీ రామనామ జపము, ధ్యానము, ఆరాధనలతో పాటు శ్రీరామనామాలేఖనము కూడా చాలా ప్రచారములో ఉన్నది. కొన్ని నగరాలలో 60సంవత్సరముల నుంచి "శ్రీ రామకోటి ఉత్సవములు" జరిపించే సంస్థలు ఉన్నాయి. వ్యక్తులు, సంస్థలు శ్రీ రామనామ మహిమల వలన శుభక్షేమాలు పొందటం జరిగింది.

1. ప్రణవము చేర్చకుండా చదవగలిగిన స్వతః సిద్దమైన వైభవము గల మంత్రము 'రామ' మంత్రమేనని రామరహస్య ఉపనిషత్త్తులు చెప్పాయి (రాం రామాయనః శ్రీరామశ్శరణం మమ మొదలైనవి).

2. 'శ్రీ రామ' అనే పదములో మూడక్షరాలు శ్రద్ధతో లిఖించిన వారికి సకల పాపములు తొలగుతాయి. నియమ బద్ధముగా వ్రాయగలిగితే మరీ మంచిది. (నియమాలు అంటే కాల నియమాలు, స్దాన నియమాలు, దేశ నియమాలు వంటివి) శ్రీరామనామము వ్రాసి, రామాయణ గాథ శ్రద్ధతో విన్నట్లయితే - సంసార బాధ్యతల పరంపరలో భగవధ్యానము చేయడానికి తగిన వ్యవధి లేనివారు, వాణిజ్య వ్యాపారాదులతో మునిగి తేలుతూ భగవదారాధనకి వెచ్చించ తగిన సమయము దొరకనివారు, వివిధ వృత్తులలో నిమగ్నమై భగవంతుని సేవించడానికి నియమములు ఎరుగనివారు ఎవరైనా సరే అందరూ - సద్గతులు పొందుతారు. మంచి మనుగడతో జీవిస్తారు.

3. శ్రీరామనామ కీర్తనకి గాని, శ్రవణమునకు పాత్ర విచారము లేదు. అంటే అందరూ చేయవచ్చును. (అంటే లేఖనము అంతేనన్నమాట) రామనామ కీర్తన, శ్రావణ, ఉపదేశముల వలన నశించని పాపము లేదు. ఇది సత్యము, రామనామము అఖండ వైభవము గల మంత్రము.
Among the various 'NAMES' of Lord Vishnu, Rama Nama is considered to be the most sacred. 'Om Namo Narayanaya' is the sacred "Vishnu Mantra" while "Om Nama Shivaya" is Shiva Mantra.

The letter 'RA' from Vishnu Mantra and the letter 'MA' from Shiva Mantra are combined to formulate "Rama" Nama. This "Rama" Nama or Rama Mantra is acceptable to the devotees of Lord Vishnu as well as Lord Shiva.

Hence uttering of 'Rama Nama' is considered to be the secret and easiest path to salvation. Hence uttering of 'Rama Nama' is considered to be the solace, for mental rest, reduces tensions and stress and establishes universal peace. As everybody knows Lord Anjaneya is an ardent devotee of Lord Rama, he was always chanting Rama Nama.

Bhaktha Pothana, Ramadas, Tyagaraja, Tulasi Das and many other devotees attained Moksha by Rama Nama Japa. If a person writes (Lekhanam) one crore Rama Nama namas, Lord Rama will shower his blessings on him and he ultimately attains moksha. Thus Rama writing Rama Nama the mind, body and soul go together. That is Thrikarana Suddi.